ETV Bharat / state

ట్రాఫిక్ తెచ్చిన మంట...వాహనదారుల తంట! - ఎండలు

మండుతున్న ఎండల్లో  ప్రయాణమంటేనే దిమ్మతిరిగి పొద్దీ.. ద్విచక్ర వాహనంపై అంటే మరీ ఎక్కువ. ఈ ఇబ్బందికి తోడు  కూడళ్లలో ట్రాఫిక్ చిక్కులుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు కర్నూలులో ఇదే పరిస్థితి. కొండ నాలుకకు మందేస్తే..ఉన్న నాలుక నాలుక ఊడినట్లుగా తయారైంది.  పోలీసుల చర్యల కారణంగా... వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.

ట్రాఫిక్ తెచ్చిన మంట...వాహనదారుల తంట!
author img

By

Published : Apr 30, 2019, 7:14 AM IST

కర్నూలు నగరంలో రోజురోజుకు వాహనాలు పెరుగుతున్నాయి. సుమారు 5 లక్షల జనాభా ఉండగా... 2.68 లక్షల ద్విచక్రవాహనాలు, 30 వేలకు పైగా ఆటోలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉదయం విద్యార్థులు, ఆ తర్వాత ఉద్యోగులు, ఇతర కారణాలతో రాకపోకలు సాగించేవారితో... ఉదయం 9 గంటల నుంచే నగరంలో... ట్రాఫిక్ సమస్య షురూ అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో...వాహన రద్దీ మరింత పెరుగుతోంది.

ట్రాఫిక్ తెచ్చిన మంట...వాహనదారుల తంట!
నగరంలోని రాజ్‌విహార్‌ సెంటర్‌, బళ్లారి చౌరస్తా, కొత్తబస్టాండ్‌, బంగారుపేట, మౌర్యాఇన్‌, పెద్దాసుస్పత్రి సర్కిల్, విశ్వేశ్వరయ్య సర్కిల్, ఆర్‌ఎస్‌ రోడ్డు, ఎస్‌బీఐ సర్కిల్‌, కొండారెడ్డి బురుజు, గడియారం ఆసుపత్రి, అబ్దుల్లాఖాన్‌ ఎస్టేట్‌, పూలబజార్‌, మండిబజార్‌, వన్‌టౌన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది.చర్యలతోనే ఇబ్బంది! ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించటం సహా...వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో...నగరంలో కొన్ని చోట్ల డివైడర్లను మూసేయటం, యూ టర్న్​లు తీసేయటం లాంటివి చేశారు. పలు కూడళ్లలో... ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. ఇక్కడే అసలైన సమస్య. గతంలో కేవలం రాజ్ విహార్ కూడలిలోనే వాహన చోదకులు ఎక్కువసేపు వేచి ఉండేవారు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రమైంది. సాఫీగా సాగిపోవాల్సిన చోట్ల... సిగ్నళ్ల కారణంగా... అరగంట వరకు ఎండలో ఉండాల్సి వస్తోంది.ఒకప్పుడు 20 నిమిషాలే! గతంలో నంద్యాల చెక్ పోస్టు నుంచి పాత బస్టాండ్ వరకు 20 నిమిషాల్లో వెళ్లేవారు. ఇప్పుడు 40 నిమిషాల నుంచి గంటసేపు పడుతోంది. బళ్లారి చౌరస్తా నుంచి కొండారెడ్డిబురుజు వెళ్లాలంటే... అరగంటపైనే పడుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు గంట ముందుగానే బయలుదేరాల్సి వస్తోంది. నగరంలో రోడ్ల విస్తరణ చేపట్టడం, అనవసరమైనచోట్ల సిగ్నళ్లు తొలగించటం, పార్కింగ్ ఏర్పాట్లు చేయడం చేస్తే..ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Delhi, Apr 28 (ANI): Avengers: The Infinity War sequel, 'Avengers: Endgame' crossed Rs 100 crore in India. Film critic and trade analyst Taran Adarsh shared the total box office collection of the film on Twitter. The film minted Rs 53 crores on the first day of its release. It has now crossed the 100 crore mark on its second day. The film beats the record set by 'Baahubali 2: The Conclusion,' which crossed the 100 crore mark within three days of its release. 'Avengers: Endgame' was released on April 26 and marks as the final film within the Marvel Cinematic Universe's current generation, which comprises of 22 films, including 'Spider-Man: Homecoming' and the recently released 'Captain Marvel'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.