తిరుపతి లడ్డూలను కర్నూలులోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో అమ్ముతున్నారు. మొదటి రోజు ఇరవై వేల లడ్డూలు రాగా అన్ని అమ్ముడయ్యాయని తితిదే అధికారులు తెలిపారు. లడ్డూలు కావాల్సిన వారికి రేపు ఉదయం నుంచి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కరోనా సమయంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం తమ దగ్గరికే రావడం సంతోషంగా ఉందని భక్తులు అన్నారు.
ఇది చదవండి కనిష్ఠ స్థాయికి శ్రీశైలం నీటిమట్టం