కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని ఆర్జీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ల పరికరాలు చోరీకి గురయ్యాయి. నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దాదాపు 350 కంప్యూటర్లలో రామ్లు దుండగులు ఎత్తుకెళ్లారు. వాటివిలువ సుమారు రూ.40 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. నిఘానేత్రాల సాయంతో నిందితులను గుర్తిస్తామని పేర్కొన్నారు. జాగిలాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం