కర్నూలు జిల్లా నంద్యాల ఎస్.బీ.ఐ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. నంద్యాల తాలూకా పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నారాయణస్వామి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణస్వామి గత మూడు రోజుల క్రితం ఓ పని మీద హైదరాబాద్‌కు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 50 వేల నగదు, రెండు తులాల బంగారం దోచుకెళ్లారు. ఘటనపై రెండో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :