కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బల్గోట గ్రామంలో బసవేశ్వర ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయంలో ఉన్న 3 హుండీలు, 10 తులాల వెండి, 10 తులాల పంచలోహ విగ్రహాలు, రూ. 1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలను సైతం తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: