కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ముగతిలో భర్త రామాంజనేయులును భార్య ఉరుకుందమ్మ గొడ్డలితో నరికి చంపింది. భర్త తాగొచ్చి గొడవపడగా... భార్య గొడ్డలితో నరికింది. అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య - crime news kurnool
కట్టుకున్న భర్తనే... ఓ భార్య కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య