చెట్టు కొమ్మ పడి యువకుడి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గాజలుపల్లిలో చోటుచేసుకుంది. రహదారిపై ఉన్న చెట్టును లారీ ఢీ కొట్టింది. కొంతసేపటికి చెట్టు కొమ్మ విరిగి పడి రహదారిపై ద్విచక్రవాహనంలో వెళుతున్న సురేష్ అనే యువకుడిపై పడింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
ఇదీ చదవండి:విశాఖలో విషాదం...ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి