ETV Bharat / state

అదృశ్యమైన వ్యక్తి.. శవమయ్యాడు! - కర్నూలులో వ్యక్తి అదృశ్యం వార్తలు

కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్​.ఖానాపురం గ్రామానికి చెందిన బోయ సుగ్రీవుడు ఈ నెల 14న ఇంటి నుంచి బహిర్భూమికి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు.

The missing person .. was found dead
అదృశ్యమైన వ్యక్తి.. శవమయ్యాడు!
author img

By

Published : Feb 26, 2021, 12:46 PM IST

ఈ నెల 14న ఇంటి నుంచి బహిర్భూమికి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్​.ఖానాపురం గ్రామానికి చెందిన బోయ సుగ్రీవుడు బహిర్భూమికి వెళ్లి అదృశ్యమైనట్లు గూడూరు ఠాణాలో కేసు నమోదైంది. అదృశ్యమైన సుగ్రీవుడు గ్రామంలోని రేమట పంటపొలాల్లో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మతిస్థిమితం లేక బురదకుంటలో పడినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య కళావతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. సుగ్రీవుడు మృతదేహానికి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో శవపంచనామా చేయించి..కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జున తెలిపారు.

ఇదీ చూడండి: గోదావరి-కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.