కర్నులు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన 5 సంవత్సరాల బాలుడిని కర్నూలు పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. స్వామి నగర్‌కు చెందిన దేవి కుమారుడు నాని ఈ నెల 19న కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
స్నేహంగా ఉంటూనే...
కొన్ని నెలలుగా ఇంటి పక్కనే స్నేహంగా ఉంటున్న నాగమణి, హరికృష్ణ దంపతులు బాలుడిని అపహరించారు. కిడ్నాప్ చేసి బాలుడిని డోన్ పట్టణంలోని మురళి అనే వ్యక్తి వద్ద ఉంచారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం ఇంటి పక్కన ఉన్న వారే అపహరించారని గుర్తించి అరెస్టు చేశారు. బిక్షాటన, దొంగతనాలకు పాల్పడడంలో శిక్షణ ఇవ్వడం కోసమే.. బాలుడిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై.. విచారణ చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: