ETV Bharat / state

MBBS Exams: ఎంబీబీఎస్​ ప్రశ్నాపత్రం ఫొటో తీస్తూ పట్టుబడిన ఇన్విజిలేటర్​

MBBS Supplementary Exams : వైద్య విద్యలో పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తారు. ఇలా ఎంత కఠినమైన చర్యలు చేపట్టినా కొందరి వల్ల.. ఉన్నతాధికారులకు తలనొప్పి తప్పటం లేదు. కర్నూలు వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఎంబీబీఎస్​ పరీక్షలలో.. ప్రశ్నపత్రాన్ని ఇన్విజిలేటర్​ ఫొటో తీశారు. ఈ విషయాన్ని చీఫ్​​ అబ్జర్వర్ గమనించి పట్టుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 28, 2023, 7:37 PM IST

Kurnool Medical College : వైద్య విద్యలో చేరి మంచి డాక్టర్లుగా స్థిరపడాలనేది విద్యార్థుల కోరిక. వైద్యులుగా సేవలు అందిచాలని విద్యార్థులు కలలు కంటుంటారు. అలాంటి వైద్య విద్యలోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న సప్లిమెంటరీ పరీక్షలలో కలకలం చెలరేగింది. ఇన్విజిలేటర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్.. గురువారం నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాన్ని​ సెల్​ఫోన్​లో చిత్రీకరించటం తీవ్ర దూమారాన్ని లేపింది. ఇన్విజిలేటర్ ఫొటో తీస్తుండగా చీఫ్ అబ్జర్వర్ గమనించి చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయం ఆరోగ్య విశ్వవిద్యాలయం దృష్టికి వెళ్లటంతో సంబంధిత ఇన్విజిలేటర్​ను.. యూనివర్శిటి అధికారులు విధుల నుంచి తప్పించారు.

ఈ నెల 25న వైద్య విద్యకు సంబంధించి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే సప్లిమెంటరీ పరీక్షలలో భాగంగా గురువారం.. కర్నూలు వైద్య కళాశాలలో అనాటమీ పేపరు-2 పరీక్షను నిర్వహించారు. కర్నూలు మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌ సాయి సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పరీక్షకు నంద్యాలలోని పలు వైద్య కళాశాలలకు చెందిన 134 మంది విద్యార్థుల వరకు హాజరయ్యారు. కళాశాలలోని ఆడిటోరియంలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా.. మరోకటి ఎస్‌పీఎం డిపార్ట్‌మెంట్​లో ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షలకు సంబంధించి రెండు కేంద్రాలకు కడప వైద్య కళాశాల చెందిన శ్రీనివాస్​ నాయక్​ అనే అధ్యాపకులు.. కర్నూలు వైద్య కళాశాలలో అబ్జర్వర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ చక్రపాణి యాదవ్ అనే డాక్టర్​ ఇన్విజిలేటర్​గా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చక్రపాణి యాదవ్​.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష పత్రాన్ని తన సెల్​ఫోన్​తో ఫోటో తీశారు. అనంతరం ఆ సెల్​ఫోన్​ను బయట పెడుతుండగా.. పరీక్షల చీఫ్ అబ్జర్వర్ గమనించి పట్టుకున్నారు. సెల్​ఫోన్​ను తనిఖీ చేశారు.

సాయి సుధీర్, వైస్ ప్రిన్సిపల్‌ కర్నూలు మెడికల్ కళాశాల

"పరీక్ష హాలులోకి వెళ్లేముందు అందరూ సెల్​ఫోన్​లు బయట పెట్టి వెళ్లారు. ఇన్విజిలేటర్​ మాత్రం ఇవ్వకుండా తనతోనే తీసుకువెళ్లారు. పరీక్ష జరుగుతున్న సమయంలో అతను సెల్​ఫోన్​ బయట పెట్టటానికి వచ్చారు. అ సమయంలో అబ్జర్వర్ గమనించి అతనిని ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. దీంతో సెల్​ఫోన్​ను సీజ్​ చేశారు." -సాయి సుధీర్, వైస్ ప్రిన్సిపల్‌ కర్నూలు మెడికల్ కళాశాల

ఘటనపై త్రిసభ్య కమిటీ : ఈ అంశాన్ని చీఫ్ అబ్జర్వర్.. చీఫ్ ఎగ్జామినర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే కర్నూలు వైద్య కళాశాల పిన్సిపల్​కు సమాచారం అందించారు. దీంతో ఆయన పరీక్ష కేంద్రానికి వెెళ్లి తనిఖీలు నిర్వహించి.. సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారాన్ని హెల్త్​ యూనివర్సిటీ రిజిస్ట్రార్​​కు దృష్టికి తీసుకువెళ్లారు. యూనివర్సిటి అధికారులు స్పందించి.. సంబంధిత ఇన్విజిలేటర్​ను పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీని నియమించినట్లు కర్నూలు మెడికల్​ కళాశాల వైస్​ ప్రిన్సిపాల్​ తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.