..
భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన భర్త - a man climbed the cell tower in miduthur
కర్నూలు జిల్లా మండల కేంద్రమైన మిడుతూరులో భార్య కాపురానికి రాలేదని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గడివేముల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన మహేష్‌కు మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన సుభద్రమ్మతో 9 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కాపురానికి రాలేదని మిడుతూరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితుడు... న్యాయం జరగలేదని సెల్ టవర్ ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు, గ్రామపెద్దలు కిందకి దించేలా చర్యలు తీసుకున్నారు.
సెల్ టవర్‌పై వ్యక్తి
..
ఇదీచూడండి.వీరస్వామి... వానరాల ఆత్మబంధువు..!