కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి మార్చి 28న మొదటి విమానం బెంగళూరు నుంచి వచ్చి ల్యాండింగ్ కానుంది. అదే రోజు నుంచి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదే రోజు కర్నూలు నుంచి విశాఖపట్నం, చెన్నైకు విమాన సర్వీసుల రాకపోకల షెడ్యూల్‌ను ఇండిగో సంస్థ శనివారం విడుదల చేసింది. సర్వీసులు నడపటానికి వీలుగా ఫిబ్రవరి 15 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలను విమానయాన సంస్థ ప్రారంభిస్తుందని అధికారులు తెలిపారు.
* ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9:05 గంటలకు విమానం బెంగళూరులో బయల్దేరి కర్నూలు చేరుకుంటుంది. అదే రోజుల్లో మధ్యాహ్నం 3:15 గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి బెంగళూరు వెళుతుంది. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 10:30 గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి విశాఖపట్నం వెళుతుంది. అదే రోజుల్లో మధ్యాహ్నం 1:00 గంటకు విశాఖపట్నం నుంచి బయల్దేరి కర్నూలు వస్తుంది.
ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2:50 గంటలకు చెన్నై నుంచి బయల్దేరి కర్నూలుకు, అదే రోజుల్లో సాయంత్రం 4:30 గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి చెన్నైకి వెళ్లనున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. కర్నూలు నుంచి బెంగళూరుకు రూ.2,077, కర్నూలు నుంచి చెన్నైకి రూ.3,144, కర్నూలు నుంచి విశాఖపట్నానికి రూ.2,463గా ప్రాథమిక ధరలను నిర్ణయిస్తూ ప్రకటన చేసింది.
ఇదీ చదవండి: తరుముతున్న నీటి సంక్షోభం- మేల్కొనకపోతే గడ్డు కాలం