కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ పరిశీలించారు. నంద్యాలలో చామకాలువ ముంపు ప్రాంతాలు శ్యాంనగర్, హానీఫ్ నగర్‌లో ఆయన పర్యటించారు. వరద తగ్గుముఖం పట్టిందని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని ఆయన అన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకున్నామని.. 45 శిబిరాలు ఏర్పాటు చేసి 16,000 వేలమందికి భోజనాలు అందించామన్నారు. నంద్యాల 18 మండలాల్లో 95 గ్రామాల్లో వరదనీరు నీరు వచ్చి 25 వేల మంది ఇబ్బందులు పడగా... 68 వేల ఎకరాల్లో పంటనష్టం, 50 ఇళ్లు పూర్తిగా, 300 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 50కిపైగా గేదెలు, మేకలు చనిపోయాన్నారు. పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్‌తోపాటు జేసీ రవి పఠాన్ శెట్టి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇదీచూడండి.సర్వరాయసాగర్‌లో సీపీఐ బృందం పర్యటన