ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించారని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఈ ఆర్ధిక ప్యాకేజిని కొన్ని రాష్ట్రాలు స్వాగతిస్తే.. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు.
కేంద్రం ఎలాంటి సహాయం చేయడం లేదని కొందరు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు లాక్డౌన్ సక్రమంగా పాటించడం వల్లే మన దేశం సురక్షితంగా ఉందన్నారు.