పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయరాదని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలులో అన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నందున వెంటనే వాటి పనులను ప్రారంభించాలన్నారు. నిధుల విషయంలో అవసరమైతే తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. రాజధానికి ఏమి అవసరమో అవి అక్కడ ఉన్నాయని.. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని తెలిపారు. కర్నూలుకు హైకోర్టు వస్తుందని ప్రచారం జరుగుతుందని.. రాయలసీమకు ఏది వచ్చినా సంతోషిస్తామని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి