ముఖ్యమంత్రి జగన్ అన్ని ప్రాంతాలకు నచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని... రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల్లో పరిపాలన వికేంద్రీకరించినట్టే... రాష్ట్రంలోనూ పరిపాలన వికేంద్రీకరణ చేయాలని సూచించారు. రాయలసీమ ప్రజలకు విశాఖ వెళ్లాలంటే కష్టమవుతుందన్నారు. 3 ప్రాంతాల్లో... మూడు విభాగాలు పెట్టడం వల్ల వికేంద్రీకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి భజన చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు కాకుండా మంచివారు సీఎం జగన్మోహన్‌రెడ్డికి సలహాలు ఇవ్వాలన్నారు. అమరావతిని దేశానికి రెండో రాజధానిగా చేసేలా... ప్రధానితో సీఎం జగన్ చర్చించాలని కోరారు.
ఇదీ చదవండి: