కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం రామతీర్థం పుట్టాలమ్మ దేవస్థానం సహాయకుడిగా పని చేస్తున్న నరసింహ అనే ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా తనకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఆళ్లగడ్డలోని దేవస్థానం ఈవో ఇంటి ముందే పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించి వేరొకరిని తీసుకోవాలని ఈవో ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.
ఇదీ చూడండి: