పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించకుండా భాదితులకు న్యాయం జరిగేలా చూడాలని తెలుగు దేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లె నియెజకవర్గంలోని సంజామల మండలం అలవకొండ గ్రామంలో గత నెలలో అధికార పార్టీ నాయకులు... తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇంటికి వచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. ఈఘటనలో దాడి చేసిన వారిపై కాకుండా.. దెబ్బలు తిన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటరెడ్డి జిల్లా ఎస్పీని కోరారు. దానాల అనిల్ కుమార్, బాలరాజు, పెద్ద చెన్నయ్య, చిన్న చిన్నయ్యలు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
ఇవీ చూడండి: