కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 69 మద్యం సీసాలను పోలీసులను పట్టుకున్నారు. ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 60 వేలు ఉంటుందని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :