ETV Bharat / state

Nara Lokesh Fires on Panyam MLA: పాణ్యం ఎమ్మెల్యే 'కరప్షన్ రాంభూపాల్ రెడ్డి': లోకేశ్ - లోకేశ్ పాదయాత్ర లేటెస్ట్ న్యూస్ టుడే

Nara Lokesh Fires on Panyam MLA Rambhupal Reddy: జగన్నాథగట్టును ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మాయం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ క్రమంలో సర్వే నంబర్లతో సహా రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టారు.

Lokesh release panyam mla fraud data news
పాణ్యం ఎమ్మెల్యే గుట్టు విప్పిన లోకేశ్ న్యూస్
author img

By

Published : May 6, 2023, 8:07 PM IST

పాణ్యం ఎమ్మెల్యే గుట్టు విప్పిన లోకేశ్

Nara Lokesh Fires on Panyam MLA Rambhupal Reddy: పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అవినీతి ఆధారాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బయటపెట్టారు. 100 కోట్ల వక్ఫ్​ భూములను కొట్టేసిన పాపం రాంభూపాల్ రెడ్డిని ఊరికే వదలదని ఆయన హెచ్చరించారు. సర్వే నంబర్ 524 లో 10.64 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆధారాలను ఆయన బయటపెట్టారు. జగన్నాథగట్టును ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మాయం చేస్తున్నారని ఆరోపించారు. స్పష్టంగా సర్వే నంబర్లతో సహా రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టారు.

దోచుకుంది చాలు, ఇక తిరిగి ఇచ్చేయండి, లేకపోతే ప్రకృతి వదిలిపెట్టదని లోకేశ్​ అన్నారు. ఎన్నిసార్లు గెలిచాం అన్నది గొప్ప కాదు.. ఏం చేశాం అన్నది చెప్పే సత్తా ఉందా అని ఆయన ప్రశ్నించారు. తాను చేసిన ఏ ఒక్క ఆరోపణకు సమాధానం చెప్పకుండా కేవలం బూతులతో విరుచుకుపడటం ఎంత వరకూ సబబో ఆలోచించాలి అని ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరప్షన్ రాంభూపాల్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులు కోసం టీడీపీ హయాంలో 11,700 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు.

రాయలసీమ క్యాన్సర్ గడ్డ జగన్ ఎంత ఖర్చు పెట్టాడో చెప్పే దమ్ము కరప్షన్ రాంభూపాల్ రెడ్డికి ఉందా అని లోకేశ్ నిలదీశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినా టీడీపీ హయాంలో ఉమ్మడి కర్నూలు జిల్లాని ఎలా అభివృద్ది చేశామో తెలుసుకోవాలని ఆయన అన్నారు. అవినీతి రాంభూపాల్ రెడ్డి రాయలసీమ క్యాన్సర్ గడ్డ జగన్​ని తిట్టాలని సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను గెలిపించారన్న లోకేశ్.. జగన్ ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా..? ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం అయినా చేసాడా..? అని ప్రశ్నించారు.

మూడు రాజధానులు అని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఒక్క ఇటుక అయినా పెట్టాడా అని నిలదీశారు. కర్నూలుకు కేటాయించిన జ్యుడిషియల్ అకాడమీని తరలించినప్పుడు మీరు రాయలసీమ క్యాన్సర్ గడ్డ జగన్​ని ఎందుకు తిట్టలేదన్నారు. మీ క్యాన్సర్ గడ్డకు ఇరిగేషన్ మీద కనీస అవగాహన లేదనటానికి నిదర్శనం కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డుని సంబంధం లేని విశాఖకు తరలించడమేనని ఆయన అన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే ఉంటే కనీసం లాయర్​ని పెట్టి వాదనలు వినిపించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిలదీయండని ఆయన సూచించారు. బుగ్గన బెంగళూరు వెళ్లి విశాఖలో న్యాయ రాజధాని అంటాడని, సుప్రీంకోర్టులో అమరావతిలోనే హైకోర్టు అని అఫిడవిట్ వేశాడని ఆయన విమర్శించారు. ఇదేనా కర్నూలుపై క్యాన్సర్ గడ్డ జగన్​కు ఉన్న చిత్తశుద్ధి అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు ఎలాగో.. కరప్షన్ రాంభూపాల్ రెడ్డి దగ్గర సమాధానాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఆయనలా తాను బూతులతో సమాధానం చెప్పనని, బాగా సరదా పడుతున్నాడు కాబట్టే ఆయన అవినీతి ఆధారాలు విడుదల చేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.