కర్నూలు జిల్లా నంద్యాలలో తెదేపా నాయకులు ధర్నా చేశారు. వైకాపా నాయకుల జోక్యం వల్లే పోలీసులు... అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురి చేశారని తెదేపా నాయకులు ఆరోపించారు. పోలీసులు, ఉన్నతాధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి పనులు చేస్తే ఇబ్బందులు పడతారని కర్నూలు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే పోలీసులు కేసులు నమోదు చేశారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని వారు కోరారు.
ఇదీ చూడండి.