తుంగభద్ర పుష్కరాల్లో పుణ్యస్నానాలను నిషేధించటంపై తెదేపా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పుష్కరాల కోసం నిధులు కేటాయించారని, పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సర్కారు వ్యవహరిస్తోందని ఈ నిర్ణయంపై పునఃసమీక్షించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి