ETV Bharat / state

'ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులపైనే వైకాపా దృష్టి' - మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా దంపతులు తాజా వార్తలు

తెదేపా నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా.. కర్నూలు జిల్లావ్యాప్తంగా తెదేపా నాయకులు వారి ఇళ్ల వద్ద రెండు గంటల పాటు దీక్ష చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల అక్రమ అరెస్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా విమర్శించారు. బీసీ జనార్థన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

tdp leader gowru charitha fires on ycp
tdp leader gowru charitha fires on ycp
author img

By

Published : May 26, 2021, 5:57 PM IST

కరోనా నివారణ చర్యల కంటే.. ప్రతిపక్ష పార్టీ నాయకుల అక్రమ అరెస్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా విమర్శించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ.జనార్థన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని జిల్లా వ్యాప్తంగా తెదేపా నాయకులు వారి ఇళ్ల వద్దే రెండుగంటల పాటు దీక్ష చేశారు. గొడవ జరుగుతుంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చిన బీసీ.జనార్థన్ రెడ్డి పై అక్రమంగా కేసు పెట్టి జైలుకు తరలించారని చరితా దంపతులు ఆరోపణలు చేశారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రతిపక్షనాయకులను ఏవిధంగా అరెస్టు చెయ్యాలా అని ఆలోచిస్తుందని వారు విమర్శించారు
ఇదీ చదవండి:

వచ్చే నెలలో అమలు కానున్న పథకాలను ప్రకటించిన సీఎం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.