కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ దుర్గ భోగేశ్వరస్వామి దేవస్థానంలో.. సూర్య కిరణాలు స్వామివారిని తాకాయి. కార్తికమాసంలో పౌర్ణమి తరువాత పది రోజులపాటు శివలింగంపై సూర్య కిరణాలు ప్రసరించటం ఇక్కడ ప్రత్యేకత. ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సూర్య కిరణాలు స్వామివారిపై ప్రసరిస్తున్న సమయంలో స్వామివారిని దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వాసం.
ఇవీ చూడండి...