రాయలసీమ విశ్వవిద్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘం నాయకులు.. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో హైకోర్టు తీర్పును అమలు చేస్తుండగా.. రాయలసీమ యునివర్సిటీ వైస్ చాన్స్లర్ హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో రిజిస్ట్రార్, డీన్, రెక్టర్ పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా.. వారికే మద్దతిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపంచారు. సంబంధిత అధికారులు స్పందించి ఇప్పటికైనా వారిని తొలిగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా?: హైకోర్టు