గర్భిణులకు కాన్పు చేయడంలో కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చెన్నమ్మ అనే మహిళ కాన్పు కోసం నంద్యాల ఆసుపత్రిలో చేరింది. ప్రసవానికి సమయం ఉందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో గర్భిణి మూత్రవిసర్జనకు మరుగుదొడ్డికి వెళ్లడంతో అక్కడ ప్రసవ ఛాయలు కనిపించాయి. ఇది గమనించి వెంటనే వార్డుకు చేరుకునే లోపు ప్రసవించింది. నిర్లక్ష్యం చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి