కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నందున... లాక్ డౌన్‌ను పోలీసులు మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం అనవసరంగా బయటకు వచ్చినవారి 40 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. వారందరితో మాస్కులు ధరింపజేసి... ద్విచక్రవాహనాలతో సహా నగరంలోని ఉల్చాల రోడ్డు నుంచి కొత్త బస్టాండ్ వరకు నడిపించారు. అక్కడ ఆ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా బయటకు వచ్చేవారికి కనువిప్పు కలగాలని ఇలా చేసినట్టు కర్నూలు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: కందనవోలు గజ గజ