కర్నూలులో రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ పోటీలను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. జాతీయ అంధుల సమాఖ్య ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో...13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారని అంధుల క్రికెట్ ఇండియా కెప్టెన్ అజేయ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న నగేష్ ట్రోఫీ కోసం క్రీడాకారుల ఎంపికకు ఈటోర్నీని నిర్వహిస్తున్నట్లు కెప్టెన్ వెల్లడించారు. అంధుల క్రికెట్లో ఆంధ్రజట్టు మొదటిస్థానంలో ఉందన్నారు.
ఇదీ చూడండి: ఆదోని నుంచి.. ఆసియా కప్ వరకు!