మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రం సుందరంగా ముస్తాబైంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శైవ క్షేత్రానికి చేరుకుంటున్నారు. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమవారం నాడే శివరాత్రి వచ్చినందున భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.
ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా... దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శివరాత్రి సందర్భంగా... పరమశివుడి క్షేత్రానికి కాలి నడకన తరలి వచ్చి మొక్కులు చెల్లించుకోవటం భక్తుల ఆనవాయితీ. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని సేవలు రద్దు చేసి సర్వదర్శనం కల్పిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ నిర్వహించారు.
ఈరోజు ఉదయం నుంచి రాత్రివరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, పంచావరణార్చనలు, శివపంచాక్షరీ జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం, ప్రభోత్సవం వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.
రాత్రి మొదట లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సహా స్వామివారికి పాగాలంకరణ చేసి... శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కల్యాణం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వసతి గృహాలు, డార్మిటరీలు అందుబాటులో ఉంచారు. తాగునీటి వసతి కల్పిస్తున్నారు. చలువ పందిళ్లు వేశారు. పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి... పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
శ్రీశైల క్షేత్రం... భక్తజన సంద్రం - శ్రీశైలం
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి మొదట లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయనున్నారు. అనంతరం స్వామివారికి పాగాలంకరణ చేసి... శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కల్యాణం నిర్వహించనున్నారు.