శ్రీశైలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా కేఎస్ రామారావు బాధ్యతలు చేపట్టారు. దేవస్థానం పరిపాలన కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు శ్రీ బ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గత ఈవోను ఎందుకు బదిలీ చేశారంటే..
గత ఈవో శ్రీరామచంద్రమూర్తి శ్రీశైలం దేవాలయంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆరోపిస్తూ... హిందూ ధార్మిక సంస్థలు చలో శ్రీశైలం కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీనితో స్పందించిన ప్రభుత్వం ఈవో శ్రీరామచంద్రమూర్తిని బదిలి చేస్తూ నిన్ననే ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఈవోగా కేఎస్ రామారావును నియమించి.. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.