శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. ఆదివారం జలాశయం నీటిమట్టం 811.90 అడుగులు, నీటి నిల్వ 35.4269 టీఎంసీలకు చేరింది. జలాశయంలో నీరు 28 టీఎంసీలకు చేరుకోగానే డెల్టా స్టోరేజీగా పరిగణిస్తారు. ఈ ప్రకారం ఇంకా 7 టీఎంసీల నీరు విద్యుదుత్పత్తి, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. జూన్‌లో ప్రారంభం కానున్న వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల జలాశయాలకు ఆశించిన విధంగా నీరు వస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 'మహా' విజృంభణ: 50 వేలు దాటిన కరోనా కేసులు