.
శ్రీరంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షునిగా శ్రీధర్ రెడ్డి ప్రమాణస్వీకారం - palakamandali pramanaswekaram at kurnool
కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి శ్రీరంగనాథ స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షునిగా శ్రీధర్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైకాపా పని చేస్తోందన్నారు. ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించటంతో పాలక మండలిలో ఐదుమంది సభ్యులు మహిళలే ఎంపికకావటం సంతోషంగా ఉందన్నారు.
శ్రీరంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షునిగా శ్రీధర్ రెడ్డి ప్రమాణస్వీకారం
.
Intro:Body:Conclusion: