ETV Bharat / state

మంత్రాలయంలో ఘనంగా శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు

author img

By

Published : Feb 27, 2023, 5:38 PM IST

Sri Raghavendra Swamy Temple : కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ జన్మదిన వేడుకలు మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్ధుల ఆద్వర్యంలో ఘనంగా ఆదివారం జరిగాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదినం కావడంతో స్వామి వారిని దర్శించుకొనేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.

Etv Bharat
Etv Bharat

Sri Raghavendra Swamy Temple : గురు రాఘవేంద్రుడి జన్మదినం రోజున మంత్రాలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 428వ జన్మదిన వేడుకలు మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్ధుల ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి. జన్మదినం సందర్భంగా పీఠాధిపతులు స్వయంగా వేకువ జామున స్వామి వారి మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, వివిధ రకాల ఫలాలతో పంచామృత అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతి ఇచ్చారు.

వేలాది మంది భక్తులు : తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో హరినాథ్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక సంస్కృత పాఠశాల నుంచి మఠం అధికారులు స్వాగతం పలికారు. పీఠాధిపతులు తలపై మోస్తూ వస్త్రాలను బృందావనం ఎదుట ఉంచి పూజలు చేశారు. బృందావనాన్ని బంగారు ఆభరణాలు, విశేష పుష్పాలతో అలంకరించారు. జయ, దిగ్విజయ, మూల రాములకు పూజలు జరిపారు. అనంతరం స్వామి వెండి చిత్రపటాన్ని నవరత్న రథంపై కొలువుంచి వైభవంగా ఊరేగించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదినం కావడంతో స్వామి వారిని దర్శించుకొనేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు : రాఘవేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా చెన్నై నుంచి వచ్చిన 500 మంది విద్వాంసులచే శ్రీ రాఘవేంద్ర స్వామి ఇష్టమైన నాగ నాదహార కార్యక్రమం నిర్వహించారు. గురు వైభవోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కల్యాణదుర్గం వారు వేసిన రాఘవేంద్ర వైభవం తెలుగు నాటకం మంత్ర ముగ్ధులను చేసింది.

హాజరైన న్యాయమూర్తులు : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపా సాగర్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ కుమార్, బెంగళూరు సమాజ సేవకులు రాజేశ శెట్టికి యోగీంద్ర మండపంలో పురస్కారాలు అందజేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.