ఆర్థిక లావాదేవీల విషయంలో తండ్రితో ఉన్న మనస్పర్థలతో కర్నూలు జిల్లాలో ఓ కొడుకు తండ్రిని దారుణంగా చంపాడు. ఓర్వకల్లు మండలం బ్రహ్మణపల్లికి చెందిన బోయఎల్లప్ప (67) అనే వ్యక్తిని ఈ నెల 9న గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి పొలంలోని వాగు వద్ద కాల్చి పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తుండగా.. చిన్న కొడుకు బోయ వెంకటేశ్వర్లుపై అనుమానంతో విచారణకు పిలిచారు.
కానీ నిందితుడు వారి నుంచి తప్పించుకునేందుకు ఊరు వదిలి పరారయ్యాడు. అతడిని గాలించిన పోలీసులు 20న అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఇందులో నేరం ఒప్పుకున్న నిందితుడు తానే రాయితో కొట్టి, ఊపిరాడకుండా గొంతు నులిమి చంపానని అంగీకరించాడు. ఎవరికీ అనుమానం రాకుండా చంపిన తరువాత డీజిల్ పోసి శవాన్ని తగల పెట్టనట్లు తెలిపినట్లు సీఐ త్రినాథ్ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: