కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కాపురానికి పంపించనందుకు ఆగ్రహించిన అల్లుడు అత్తపై దాడికి దిగాడు. మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన పెద్దక్క తన కూతురిని అదే గ్రామానికి చెందిన హరి అనే వ్యక్తికిచ్చి వివాహం జరిపించింది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు కారణంగా పెద్దక్క కూతురు కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటోంది.
గురువారం హరి అత్తింటికి వెళ్లి కూతురిని కాపురానికి రమ్మని కోరగా పెద్దక్క నిరాకరించింది. దీనిపై ఆగ్రహించిన అల్లుడు హరి అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బంధువులు ఆమెను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ఆళ్లగడ్డ గ్రామీణ ఎస్సై వరప్రసాద్ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: