కర్నూలు జిల్లా నంద్యాలలో తల్లిపై కుమారుడు దాడి చేశాడు. పట్టణంలోని రాయల్ కాంపౌండ్‌కు చెందిన చాకలి అంజనమ్మను.. ఆమె కుమారుడు రాముడు రోకలి బండతో తలపై కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...