తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం ద్వారా... వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లవుతుందని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. తమ అభ్యర్థికి 5 లక్షల మెజారిటీ వస్తుందని చెబుతున్న అధికార పార్టీ... మంత్రులు, ఎంపీలను ఇన్ఛార్జులుగా ఎందుకు నియమించిందని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో... డబ్బు, మద్యం ఏరులై పారుతోందని... ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఇదీ చదవండి: