ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా మహానందిలో పదహారవ రోజు పండుగ ఘనంగా జరిగింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అనంతరం 16వ రోజున పండుగలా వేడుక జరుపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్, వేదండితులు, భక్తులు పాల్గొన్నారు. చండీశ్వరుడు, త్రిశూల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడే నిలిపిన రథానికి పూజలు చేశారు. రథాన్ని లాగి మునపటి స్థానంలో ఉంచారు.
ఇదీ చదవండి: