ETV Bharat / state

వాయువు అందితేనే ఆయువు - corona cases in kurnool

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ 1,500కుపైగా కేసులు వస్తుండటంతో బెడ్లు దొరక్క రోగులు అల్లాడుతున్నారు. సర్వజన వైద్యశాలలో 924 మంది రోగులు చికిత్స పొందుతుండగా అందులో 674 మందికి ఆక్సిజన్‌ సాయంతో, 135 మందికి వెంటిలేటర్లపైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కర్నూలు సర్వజన వైద్యశాలలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ ప్లాంటు

author img

By

Published : May 10, 2021, 12:30 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ 1,500కుపైగా కేసులు వస్తుండటంతో బెడ్లు దొరక్క రోగులు అల్లాడుతున్నారు. సర్వజన వైద్యశాలలో 924 మంది రోగులు చికిత్స పొందుతుండగా అందులో 674 మందికి ఆక్సిజన్‌ సాయంతో, 135 మందికి వెంటిలేటర్లపైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్‌ బెడ్లపై ఉన్నవారికి నిమిషానికి 6 లీటర్లు.. గంటకు 360 లీటర్లు.. 24 గంటలకు 8,640 లీటర్లు కావాల్సి ఉంది. ఐసీయూ పడకలపై ఉన్నవారికి నిమిషానికి 60 లీటర్లు.. గంటకు 3,600 లీటరు, 24 గంటలకు 86,400 లీటర్ల ఆక్సిజన్‌ అవసరం. ఆసుపత్రిలో 20 టన్నుల మేర నిల్వలు ఉండగా రోజుకు 13 టన్నులు వినియోగిస్తున్నారు. ప్రస్తుతమున్న రోగులకు ఆక్సిజన్‌ సరిపోతున్నా బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ ఆక్సిజన్‌ కొరత ఏర్పడే ప్రమాదముంది. ఫలితంగా కొత్తవారిని చేర్చుకోవడంలో సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇలా

జిల్లావ్యాప్తంగా 23 ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో 736 మంది ఆక్సిజన్‌ పడకలపైన చికిత్స పొందుతున్నారు. ఐసీయూ బెడ్లపై సుమారు 162 మంది ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు 20 టన్నుల ఆక్సిజన్‌ ఖర్చవుతోంది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులకు సంబంధించి ఆక్సిజన్‌ సరఫరా సరిపోతున్నా రోజురోజుకు బాధితులు పెరిగిపోతుండటం.. ఆక్సిజన్‌ సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో చాలా ఆస్పత్రుల్లో బెడ్లు ఉన్నా చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. నంద్యాల శాంతిరామ్‌, విశ్వభారతి వైద్య కళాశాలలతోపాటు కొన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో బెడ్లు పెంచే అవకాశమున్నప్పటికీ ఆక్సిజన్‌ కారణాలతో కొత్తవారిని చేర్చుకోవడం లేదని సమాచారం.

11 వేల మందికిపైగా బాధితులు

కరోనా సెకండ్‌ వేవ్‌లో చాలామంది ఆక్సిజన్‌ సమస్యతో అల్లాడుతున్నారు. పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. రోగి పరిస్థితి చేయిదాటుతుండటం.. బెడ్లు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోగులకు చేర్చుకోకపోతుండటంతో మెరుగైన వైద్యం అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 11 వేల మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో సుమారు 2 వేల మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. జిల్లావ్యాప్తంగా కర్నూలు సర్వజన వైద్యశాలతోపాటు నంద్యాల, ఆదోని ఆస్పత్రులు, శాంతిరామ్‌ విశ్వభారతి వైద్య కళాశాలతోపాటు 23 ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రులు నడుస్తున్నాయి.

మరిన్ని షెడ్ల ఏర్పాటుకు చర్యలు

కర్నూలు సర్వజన ఆస్పత్రికి ప్రతిరోజూ వందల మంది కరోనా బాధితులు వస్తుండటంతో బెడ్ల సమస్య వేధిస్తోంది. గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో చివరికి చాలామంది వెనుదిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. పెద్దాస్పత్రిలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దనున్న ఖాళీ స్థలంలో జర్మన్‌ షెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ పనులు పూర్తవగానే మరికొందరు రోగులకు ఇక్కడ వైద్య సేవలు అందించనున్నారు. రానున్న కాలంలో బాధితుల సంఖ్య పెరిగితే వివిధ ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

కొత్త ప్లాంటు అందుబాటులోకి వస్తే

కర్నూలు సర్వజన ఆస్పత్రిలో కొత్తగా మరో ఆక్సిజన్‌ ప్లాంటును సిద్ధం చేస్తున్నారు. దీనికిగాను ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కలెక్టర్‌తోపాటు ఆస్పత్రి అధికారులు సైతం నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ కొత్త ప్లాంటు ద్వారా ప్రతిరోజూ 1,000 లీటర్ల ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా సుమారు 200 మంది రోగులకు సాంత్వన లభిస్తుంది. మరోవైపు ఎక్కడ అవకాశాలున్నా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లను సిద్ధం చేసేలా.. మూతపడిన వాటిని తెరిపించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

కరోనా బులిటెన్‌

  • జిల్లావ్యాప్తంగా ఆదివారం నమోదైన కేసులు : 1,568
  • చికిత్స పొందుతున్నవారు : 11,060
  • ఇప్పటివరకు నమోదైన కేసులు : 92,698
  • పూర్తిగా కోలుకున్నవారు : 81,043
  • ఇప్పటివరకు కొవిడ్‌తో చనిపోయిన వారు : 595

ఇదీ చదవండి:

ఏపీ నుంచి వెళ్లే కొవిడ్ అంబులెన్స్​లు అడ్డగింత

'సర్కారు పనిచేసుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.