కర్నూలు జిల్లా మహానంది ఆలయం బయట పాదరక్షలు భద్రపరుచినందుకు భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం చిత్రం ఉండటం వివాదాస్పమైంది. ఆలయానికి వచ్చే భక్తులు పాదరక్షలు కౌంటర్లో వదిలి వెళ్తారు. అందుకు ఓ రశీదు ఇస్తారు. దానిపై శివలింగం చిత్రాన్ని పొందుపరిచారు. కొందరు భక్తులు గమనించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటి స్థానంలో వేరే రశీదులను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: రైతులు భూములను మంత్రి తిరిగి ఇచ్చేయాలి: రామకృష్ణ