కర్నూలు నగర శివార్లలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద భారీగా బంగారు ఆభరణాలను సెబ్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అక్రమంగా ఇన్నోవా కారులో ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాసులు పట్టుకున్నారు.హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బంగారాన్ని తరలిస్తున్నామని అజయ్, ప్రకాష్ అనే వ్యక్తులు పోలీసు విచారణలో వెల్లడించారు. 7 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రూ 3 కోట్లు విలువైన బంగారంతో పాటు రూ. 10 లక్షల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం కేసును తాలూకా పోలీసు స్టేషన్‌కు అప్పగించారు.
ఇదీ చూడండి. ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా సీట్ల పెంపు... చట్ట సవరణకు త్వరలో ఆర్డినెన్స్