కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. కుంబారు గెరి వద్ద వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం రహదారి వైపు కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వాహన చోదకుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఎటువంటి ప్రాణాపాయం జరగనందున స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : కోడుమూరులో మోస్తరు వర్షం