ETV Bharat / state

ఫీజుల కోసం ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల వేధింపు - కర్నూలు జిల్లాలో ప్రైవేట్​ పాఠశాల ఫీజులు

కరోనా వల్ల మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరచుకోలేదు. ప్రస్తుతం ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫీజుల వసూళ్ల విషయంలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవేమీ పట్టించుకోని యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనలు ఇందుకు నిదర్శనం.

corporate school fees in lockdown
చదువులెలా ఉన్నా.. రూపాయలు పోయాల్సిందే
author img

By

Published : Oct 10, 2020, 2:39 PM IST

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో పీడిస్తున్నాయి. కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతపడిన నాటి నుంచి ఫీజులు చెల్లించాల్సిందేనని విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు విన్నా వినకపోయినా తమకు సంబంధం లేదని ఫీజులైతే చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. లేనిపక్షంలో కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్‌ ఇవ్వమని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలువురు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించగా సర్దుబాటు కాని వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నిస్తుండగా టీసీ ఇచ్చేది లేదని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యా శాఖ అధికారులు తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

వాస్తవానికి పాఠశాలలు జూన్‌ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయినా ఆయా కార్పొరేట్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలు ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫీజుల వసూళ్లు, అధిక ఫీజుల విషయంలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా 10 శాతం ఫీజులు పెంచడమే కాకుండా పాత బకాయిలు సైతం చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. తరగతులు జరగకపోయినా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, సమదుస్తులు, షూ, టై కొనాల్సిందేనని ఆదేశాలు ఇస్తున్నాయి. పాఠశాల ఆవరణలోనే ప్రత్యేక గదుల్లో అనుమతులు లేకపోయినా అమ్మకాలు సాగిస్తున్నారు. పాఠశాలలు నిర్వహించకపోతే పాఠ్యపుస్తకాలు కొనుక్కుని ఏం చేస్తామని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అధిక ఫీజులు, పాఠ్యపుస్తకాల అమ్మకాలపై ఫిర్యాదుల కోసం విద్యాధికారులు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయకపోవడం విచారకరం.

kurnool district data
కర్నూలు జిల్లా వివరాలు

● నగరానికి చెందిన వెంకటేష్‌ కుమారుడు ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. యాజమాన్యం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతికి ప్రత్యేకంగా నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అన్నింటికీ రూ.12 వేలు ఖర్చు చేశారు. వీటితోపాటు లాక్‌డౌన్‌ సమయంలో జూన్‌ నుంచి టర్మ్‌ ఫీజు చెల్లించాలంటూ ఇటీవల చరవాణికి సందేశం పంపారు. ఇదేంటని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే మీ పిల్లల కోసం లాక్‌డౌన్‌ సందర్భంలోనూ పని చేశామని సమాధానం ఇచ్చారు.

● ప్రైవేట్‌ ఉద్యోగి రమణ కుమారుడు, కుమార్తె ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరికి సంబంధించి ఫీజు పాత బకాయిలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో రమణ ఉద్యోగానికి వెళ్లలేదు. వేతనం లభించలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఆన్‌లైన్‌ తరగతులకు లింక్‌ తీసుకోలేదు. పాఠశాలలు తెరుచుకోనున్నాయని ఆశాభావంతో పాఠశాలకు వెళ్లారు. పాతబకాయిలు, ప్రస్తుత ఫీజులు చెల్లిస్తేనే మీ పిల్లలకు ప్రవేశం కల్పిస్తామని చెప్పడంతో అతను కంగుతిన్నారు. తప్పని పరిస్థితిలో సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు నిర్ణయించుకుని, పాత బకాయిలు చెల్లిస్తాను టీసీ ఇమ్మని అడిగితే ససేమిరా అన్న పాఠశాల సిబ్బంది ఈ విద్యా సంవత్సరం ఫీజులు కూడా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయడంతో అతను దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

చరవాణికి సందేశాలు

ఫీజు వసూళ్ల కోసం యాజమాన్యం నియమించుకున్న సిబ్బంది అదేపనిగా తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రతిరోజూ చరవాణికి సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. జూన్‌ నుంచి ఫీజులు, పాత బకాయిలు మొత్తం చెల్లించకపోతే మీ పిల్లవాడి అడ్మిషన్‌ తొలగిస్తున్నామని హెచ్చరిస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా...యాజమాన్యం తీరు మారడం లేదు.

ఎందుకీ పక్షపాతం

భావి భారత పౌరులను తీర్చిదిద్దేది మేమే...మరి నా బతుకుకేదీ భరోసా..? అంటూ ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు కన్నీరు పెట్టుకుని మరీ రోడ్డుపైకి వచ్చారు. ఏడు నెలలుగా జీతాలు రాక అనేక అవస్థలు పడుతున్న వీరిని ప్రభుత్వం కానీ ప్రైవేట్‌ యాజమాన్యాలు కానీ పట్టించుకున్న పాపానపోలేదు. లాక్‌డౌన్‌, కరోనాను సాకుగా చూపిస్తూ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు జీతాలు ఇవ్వడం లేదు. మరికొన్ని ప్రైవేట్‌ సంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు, ప్రవేశాల పేరుతో పనిచేయించుకుని కూడా మొండి చేయి చూపిస్తున్నాయి. ఫీజులు కట్టాలని సందేశాలు పంపుతున్న యాజమాన్యాలు తమకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్‌ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా...విద్యాధికారులు తమకేం ఫిర్యాదు రాలేదంటూ చేతులు దులుపుకొంటున్నారు.

kurnool district data
కర్నూలు జిల్లా వివరాలు

ఇదీ చదవండి: కేన్సర్ వ్యాధిపై అవగాహనకు 3 కె రన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.