కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో అబ్దుల్ రజాక్ అనే ఆరో తరగతి విద్యార్థిని డైరెక్టర్ రవితేజ రెడ్డి బెత్తంతో చితకబాదాడు. ఇద్దరు విద్యార్థులు చిన్నపాటి ఘర్షణ పడుతుండడంతో అక్కడే ఉన్న డైరెక్టర్ రవితేజ రెడ్డి.. అబ్దుల్ రజాక్‌ను గదిలోకి తీసుకువెళ్లి పిరుదులపై బాదాడు. సాయంత్రం బాలుడిని ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి హుస్సేన్ పాఠశాలకు రాగా.. అసలు విషయం చెప్పాడు. వెంటనే రజాక్‌ను తండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం బనగానపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పూర్వాపరాలు విచారించిన ఎస్సై కృష్ణమూర్తి డైరెక్టర్ రవితేజ రెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: