కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఎగువ నుంచి వచ్చే భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది. ఆలయ పూజారి రఘురామశర్మ శిఖర పూజలు నిర్వహించారు. మరో వైపు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 3,15,576 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 854.80 అడుగులకు చేరింది.
ఇదీ చదవండి.. ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం.. 70 గేట్లు ఎత్తి దిగువకు విడుదల