కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్కరాళ్లలో సజ్జల కొనుగోలు కేంద్రాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రారంభించారు. మార్కెట్ యార్డు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో.. రైతు భరోసా కేంద్రంలో సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారని ఎమ్మెల్యే రైతులకు వివరించారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి