కర్నూలు జిల్లాలోని అహోబిల క్షేత్రంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత ఐదు రోజులుగా దిగువ అహోబిలంలోని ప్రహ్లాద వరద స్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో అభిషేకాలు, హోమాలు చేస్తున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటి నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే అహోబిల మఠం 46 వ పీఠాధిపతి శ్రీ రంగనాథ మహాదేశికన్ పాల్గొని మహా పూర్ణాహుతి నిర్వహించారు.
ఇదీ చదవండి: 'స్పైస్ జెట్'ను వెంబడించిన పాక్ యుద్ధ విమానాలు.!