ETV Bharat / state

ROAD DAMAGE ISSUES రూ.3.5 కోట్లతో రోడ్డు వేశారు.. మూడు నెలలకే కొట్టుకుపోయింది: మంత్రి బుగ్గనపై స్థానికులు ఆగ్రహం - MINISTER BUGGANA news

Don constituency people fire on Minister Buggana: రోడ్లు వేయండి మహా ప్రభో.. అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ప్రజలు. ఎన్నికల ఏడాది అనుకున్నారో.. ఇప్పటికీ రోడ్లు వేయకపోతే,ప్రజాగ్రహం చూడాల్సి వస్తుందని అనుకున్నారో. ఎట్టకేలకు ఆర్ధిక మంత్రి ఇలాకాలో రోడ్డు వేశారు. ఆ రహదారి వేసి పట్టుమని మూడు నెలలు అయ్యిందో లేదో.. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే, కొత్త రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో నాణ్యత లేని రోడ్లు వేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ROAD DAMAGE
ROAD DAMAGE
author img

By

Published : Jun 24, 2023, 8:09 PM IST

Updated : Jun 24, 2023, 8:23 PM IST

Don constituency people fire on Minister Buggana: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసి మూడు నెలలు గడవకముందే చిన్నపాటి వర్షానికే రోడ్డంతా కొట్టుకుపోయిందంటూ విమర్శిస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం నాణ్యత లేని రోడ్లు వేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల సొంత నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే.. మారుమూల గ్రామాల రోడ్ల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి..నాణ్యత లేని రోడ్లు వేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్నాం.. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో.. డోన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నామని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్నామని, డోన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, గతంలో ఏ ప్రభుత్వాలు వేయని రోడ్లను తమ ప్రభుత్వ హయంలో వేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం మంత్రి వ్యాఖ్యలకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న మంత్రి బుగ్గన ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన రోడ్డు... రెండ్రోజుల క్రితం కురిసిన చిన్నపాటి వర్షానికి కొట్టుకుపోయిందని తెలియజేశారు.

Ministers : 'మా దగ్గర వాగులే లేవు.. ఇసుక మాఫియా అని ఎలా అంటారు..!'

రూ.3.5 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం.. ఏప్రిల్ 13వ తేదీన డోన్ నుంచి వెంకటనాయునిపల్లి మీదుగా గోవర్ధనగిరి వరకూ దాదాపు 13 కిలోమీటర్ల రోడ్డున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ మార్గంలో తిమ్మాపురం, ఆవులదొడ్డి, కామగానికుంట్ల, గువ్వలకుంట్ల, బోగోలు, చెర్లకొత్తూరు, సి. రంగాపురం, లక్ష్మిపల్లి తదితర గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. డోన్ నుంచి గోవర్ధనగిరి మీదుగా వెల్దుర్తికి సైతం వెళుతుంటారు. అంతేకాదు, ఆటోలు, బస్సులు, ద్విచక్రవాహనాలతో నిత్యం ఈ ప్రాంతాల రోడ్లు రద్దీగా ఉంటాయి. డోన్ నుంచి గోవర్ధనగిరి వరకూ సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో తారు రోడ్డును నిర్మించారు.

కోతకు గురైన రోడ్డుపై మంత్రి బుగ్గన దృష్టి పెట్టాలి.. పలువురు స్థానికులు మాట్లాడుతూ..''రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది. డోన్ పట్టణంలోని భారత్ గ్యాస్ ఎదురుగా.. బ్రిడ్జిపై రోడ్డు మొత్తం లేచిపోయి.. వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. వెంకటనాయునిపల్లి మారెమ్మ గుడి వద్ద రోడ్డు బాగా దెబ్బతిని, కోతకు గురైంది. రోడ్డు నాణ్యత బాగా లేదు. గుత్తేదారులు రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం, మంత్రి స్పందించి.. గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కొట్టుకుపోయిన రోడ్డుపై మంత్రి బుగ్గన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.'' అని అన్నారు.

చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయిన రోడ్డు.. మంత్రి బుగ్గనపై విమర్శలు

Last Updated : Jun 24, 2023, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.