కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం.. బాలుడిని గాయపడేలా చేసింది. స్థానిక ఫరూక్ నగర్ సమీపంలో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు... సులేమాన్ అనే బాలుడిని ఢీ కొట్టింది. ఘటనలో బాలుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్ సహాయంతో సులేమాన్‌ను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: