కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక రైల్వే గేట్ వద్ద డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఓ కారు అతివేగంతో ఢీ కొట్టింది. అనంతరం డ్రైవర్ బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కటం వల్ల పక్కనే ఉన్న చెప్పుల షాపు వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
ఇదీ చూడండి: